స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించిన
తల్లి వలె నన్ను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవితకాలమంతా
ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా…
1. ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు
నీ కృపా బాహుళ్యమే
వీడని అనుబంధమై
తలచిన ప్రతి క్షణమున
నూతన బలమిచ్చెను
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా…
2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు
నీ దివ్య సంకల్పమే
అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై
నిరీక్షణ కలిగించెను
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా…
3. హేతువు లేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు
హేతువు లేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు
నీ ప్రేమ మాధుర్యమే
నా నోట స్తుతి గానమై
నిలిచిన ప్రతిస్థలమున
పారెను సెలయేరులై
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించిన
తల్లి వలె నన్ను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవితకాలమంతా
ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
జీవితకాలమంతా
ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
నిన్నే ఆరాధించి ఘనపరతును
నిన్నే ఆరాధించి ఘనపరతును
నిన్నే ఆరాధించి ఘనపరతును…..

Leave a Reply