[Verse]
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి
[Verse]
యీ జయశాలి కన్న
మనకింక రాజెవ్వరును లేరని
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
1. కరుణ గల సోదరుండై
యీయన ధరణి కేతెంచెనయ్యా
కరుణ గల సోదరుండై
యీయన ధరణి కేతెంచెనయ్యా
[Verse]
తిరముగా నమ్ముకొనిన
మన కొసగు బరలోక రాజ్యమ్మును
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
2. నక్కలకు బొరియలుండె
నాకాశ పక్షులకు గూళ్లుండెను
నక్కలకు బొరియలుండె
నాకాశ పక్షులకు గూళ్లుండెను
[Verse]
ఒక్కింత స్థలమైనను మన
విభుని కెక్కడ లేకుండెను
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
3. అపహాసములు సేయుచు
నాయన యాననముపై నుమియుచు
అపహాసములు సేయుచు
నాయన యాననముపై నుమియుచు
[Verse]
గృప మాలిన సైనికు లందరును
నెపము లెంచుచుగొట్టిరి
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
4. కరమునం దొక్క రెల్లు
పుడకను దిరముగా నునిచి వారల్
కరమునం దొక్క రెల్లు
పుడకను దిరముగా నునిచి వారల్
[Verse]
ధరణీ పతి శ్రేష్ఠుడా నీకిపుడు
దండ మనుచును మ్రొక్కిరి
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
5. ఇట్టి శ్రమలను బొందిన
రక్షకుని బట్టుదలతో నమ్మిన
ఇట్టి శ్రమలను బొందిన
రక్షకుని బట్టుదలతో నమ్మిన
[Verse]
అట్టహాసముతోడను
బరలోక పట్టణంబున జేర్చును
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
6. శక్తిగల రక్షకుండై
మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
శక్తిగల రక్షకుండై
మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
[Verse]
భక్తితో బ్రార్థించిన
మన కొసగు రక్తితో నా ముక్తిని
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…
[Verse]
7. త్వరపడి రండి రండి
యీ పరమ గురుని యొద్దకు మీరలు
త్వరపడి రండి రండి
యీ పరమ గురుని యొద్దకు మీరలు
[Verse]
దరికిజేరిన వారిని యీ ప్రభువు
దరుమడెన్నడు దూరము
రాజులకు రాజైన యీ
మన విభుని పూజసేయుటకు రండి…..

Leave a Reply