[Verse]
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
[Verse]
ఓ…..మేఘ వాహనంబు మీద
వేగమే
ఓ….. మించు వైభవంబు తోడ
వేగమే
[Verse]
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
[Verse]
1. ఓ…… భూజనంబులెల్ల
తేరి చూడగా
ఓ……నీ జనంబు
స్వాగతంబు నీయగా
[Verse]
నీ రాజ్యస్థాపనంబు సేయ
భూ రాజులెల్ల గూలిపోవ
భూమి యాకసంబు మారిపోవ
నీ మహా ప్రభావమునవేగ
[Verse]
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
[Verse]
2. ఆ….. ఆకసమున
దూత లార్భటింపగా
ఆ…… ఆది భక్త
సంఘ సమేతంబుగా
[Verse]
ఆకసంబు మధ్య వీధిలోన
ఏకమై మహాసభ జేయ
యేసునాథ! నీదు మహిమలోన
మాకదే మహానందమౌగ
[Verse]
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
[Verse]
3. ఓ…… పరమ యెరుషలేము
పుణ్య సంఘమా
ఓ…… గొఱియ పిల్ల
క్రీస్తు పుణ్య సంఘమా
[Verse]
పరమదూతలార! భక్తులార!
పౌలపోస్తులార! పెద్దలార!
గొఱియపిల్ల యేసు రాజుపేర
క్రొత్త గీతమెత్తి పాడ రారా
[Verse]
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా

Leave a Reply