పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)
పూస్తున్నది ఉదయాన్నే (2)
రాలిపోతున్నది త్వరలోనే (2)
పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)
1. ఓ చిన్న పూవు
తన జీవితంలో
పరిమళాన్ని
ఇస్తుందయా (2)
ఆ పువ్వుకంటే
మరి గొప్పగా
చేసిన నీలో
ఆ పరిమళముందా? (2)
పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)
2. ఒకనాడు యేసు
మన పాపములకై
పరిమళాన్ని
వెదజల్లెను (2)
ఆ యేసు మరణం
నీ కోసమేనని
ఇకనైనా
గమనించవా? (2)
పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)
3. అతి చిన్న ఆయువు
ప్రతి పూవు కలిగి
అందరిని ఆకర్షించును (2)
బహుకాలము బ్రతికి
బహు జనులను పిలిచి
సువార్తను వెదజల్లవా? (2)
పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)
పూస్తున్నది ఉదయాన్నే (2)
రాలిపోతున్నది త్వరలోనే (2)
పువ్వుకింత పరిమళమా
ఒకరోజుకింత అందమా (2)

Leave a Reply