నే నీ వాడనై యుండగోరెదన్
యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్
నన్ను జేర్చు నీ దరిన్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్
నన్ను బ్రతిష్ఠపర్చు మీ నాథా
నీదు కృపవల్లనే
నాదు నాత్మ నిన్ను నిరీక్షించు
నీ చిత్తంబు నాదగున్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్
నీదు సన్నిధిలో నికనుండ
నెంత తుష్ఠి నాకగున్
స్నేహితునిగ మాటలాడెదన్
సర్వశక్త ప్రభుతో
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్
నీదు దివ్య ప్రేమాతిశయము
ఇహబుద్ధి కందదు
పరమందున దాని శ్రేష్ఠత
నే ననుభవించెదన్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు – చేర్చు – చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్…..

Leave a Reply