Yesulo Harshinchedamu
[Verse]
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
మహిమ మహిమ
మహిమలో హర్షించెదము
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం…
[Verse]
1. పరిశుద్ధులు హర్షింప
యేసు త్వరగా రమ్మని పలుక
మారు వారికి శిఖరం
మనసారగ దేవుడిచ్చున్
[Verse]
మహిమ ఘనము
మహిమలో నానందింప
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం…
[Verse]
2. శుద్ధ జీవులైన
దేవసుతులు ప్రకాశింపన్
సర్వ సృష్టి యొక్క
మహా కర్మము లన్నియు తీర
[Verse]
రాజుకు మహిమ కలుగు
దినములు రాగా
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
3. దాసులెల్లలు కూడి
దేవుడిచ్చు మకుటము పొంది
వేయి సంవత్సరముల్
రాజ్య మేలుచుండునపుడు
[Verse]
నెమలి, కోకిల, గొఱ్ఱె పులితో వసించున్
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
4. చదల పుడమి నశింప
నవ భూమ్యాకాశముల్ కలుగ
శాప పాపముల్ సకల
కడు రోగము లెల్లను తీర
[Verse]
సుఖము, జయముతో
నెల్లరు నానందింప
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
5. బంగారు వీధులును
బహు రంగుగా నొప్పుచుండున్
మెరయు వజ్రా కాంతుల్
కూడ నీవు చూచి హర్షింప
[Verse]
క్లేశ కన్నీరు లేని నగరులోన
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
6. స్ఫటిక జీవ నదియు
ఇరు ప్రక్కల జీవ వృక్షమును
ఆకలి దప్పులు లేక
నట జీవ ఫలముల భుజించి
[Verse]
తినుచు, త్రాగుచు
యేసులో నానందింప
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
7. పరిశుద్ధాత్మయు సుతుడు
చేసిన రక్షణ కార్యమును
తండ్రి దూతల గణముల్
నట చూచి ప్రహర్షింపన్
[Verse]
క్రొత్త కార్యము కొరకు ఆనందింప
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం
[Verse]
మహిమ మహిమ
మహిమలో హర్షించెదము
యేసులో హర్షించెదము
మహిమలో హర్షింతుము నిరతం…..

Leave a Reply