Yesu Swami Neeku Nenu
[Verse]
1. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము…
[Verse]
2. యేసు స్వామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము…
[Verse]
3. నేను నీ వాడను యేసు నీవును నావాడవు
నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము…
[Verse]
4. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనే నే యేగితి
నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవె నియ్యవే
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము…
[Verse]
5. యేసు నీదె నా సర్వాస్తి హ సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందము హల్లెలూయ స్తోత్రము
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము…..

Leave a Reply