Yehova Na Moralalinchenu
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను నను గణించెను
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను నను గణించెను
[Verse]
అహర్నిశల దీనహీనుడగు
నాదు హా యనెడు ధ్వని
గ్రహించి మనిపెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…
[Verse]
1. పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జేర్చి సేద దీర్చెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…
[Verse]
2. మదావళము బోలు నామదిన్
దన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్
యథేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…
[Verse]
3. అనీతి వస్త్రమె డలించెను
యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…
[Verse]
4. విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకిలాగి నను సుఖ
కళావళుల్ మనసులోన నిలిపెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…
[Verse]
5. అగణ్య పాపియని త్రోయక
నన్ను గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతి కొప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను
[Verse]
యెహోవా నామొఱలాలించెను
దనమహా దయను
నను గణించెను…..

Leave a Reply