Vinare Yo Narulara

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
అనుదినమును దే
వుని తనయుని పద
వనజంబులు మన
మున నిడికొనుచును

[Verse]
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
3. పొందు గోరిన వారి విందా పరమోపకారి
యెంద రెందరి బరమా నంద పద మొందగ జేసెను
అందమునన్‌ దన బొంది సురక్తము
జిందెను భక్తుల డెందము గుందగ

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
4. ఇల మాయావాదుల మాని యితడే సద్గురుడని
తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని
గొలచిన వారికి నిల జనులకు గలుముల నలరెడు ధనికుల
కందని సుఖములు మరి యొసగును

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
5. దురితము లణప వచ్చి
మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం
దర మందిరమున

కరుదుగ జనె
బిరబిర మన మందర మా
కరుణా శరనిధి చరణమె శరణని పోదము

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే

[Verse]
అనుదినమును దే
వుని తనయుని పద
వనజంబులు మన
మున నిడికొనుచును

[Verse]
వినరే యో నరులారా
వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుడయ్యె వినరే…

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading