Viluvainadi Nee Ayushkalam

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం

దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్పకాలం
దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్పకాలం

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం…

1. బంగారు సంపదలను
దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు
నిరీక్షణతో వెదికినా

నీ కడుపున పుట్టిన
కుమారుడు తప్పిపోయినా
నీ కొరకు వస్తాడేమో
వెదకుచు ఒక రోజున

బంగారు సంపదలను
దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు
నిరీక్షణతో వెదికినా

నీ కడుపున పుట్టిన
కుమారుడు తప్పిపోయినా
నీ కొరకు వస్తాడేమో
వెదకుచు ఒక రోజున

పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం…

2. మనిషి సగటు జీవితం
డెబ్బది సంవత్సరములు
అధికబలము ఉన్నయెడల
ఎనుబది సంవత్సరములు

ఆయాసమే దుఃఖమే
నీ కడవరి కాలము
ఆదరించువారులేని
కన్నీటి క్షణములు

మనిషి సగటు జీవితం
డెబ్బది సంవత్సరములు
అధికబలము ఉన్నయెడల
ఎనుబది సంవత్సరములు

ఆయాసమే దుఃఖమే
నీ కడవరి కాలము
ఆదరించువారులేని
కన్నీటి క్షణములు

దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము
దేవునితో క్రీస్తువలె ఉండెదవు కలకాలము
దేవునితో క్రీస్తువలె ఉండెదవు కలకాలము

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం

దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్పకాలం
దేవునితో ఉండుటకు బహు దీర్ఘకాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్పకాలం

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading