Vachindi Kotta Samvatsa
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది కొత్త సంబరాలను (2)
యెహోవా చేసిన దినము
యేసునందే మనకు శుభము (2)
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది కొత్త సంబరాలను
1. ఏ తెగులు నీ గుడారము
అంటకుండ కాపాడినాడు
ఏ రోగము నీ శరీరము
తగలకుండ భద్రపరచినాడు
తన ప్రేమనే నిండుగా మనపై చూపించినాడు
వాత్సల్యమే మెండుగా మనపై కురిపించినాడు
వందనాలు పాడి ఆడుదామా
అందమైన ఈ రేయిలో
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది కొత్త సంబరాలను (2)
2. నీ మార్గములో నీ పాదమును
తొట్రిల్లపడనియ్యలేదు
నీశోధనలో నీ రోదనలో
ఓదార్పు తానైయున్నాడు
నీ అండగా తోడుగా నిత్యం నీతో నిలిచాడు
నీ కోటగా కొండగా కష్టం తొలగించినాడు
మేలులెన్నో పొందుపరచినాడు
కీర్తించి కొనియాడుదాం
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది కొత్త సంబరాలను (2)
యెహోవా చేసిన దినము
యేసునందే మనకు శుభము (2)
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది కొత్త సంబరాలను (2)

Leave a Reply