Tanuvu Na Didigo
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు
వినతిన్ బ్రవహింప జే యను శక్తి నీయుమీ
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…
1. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై
పనిచేయ జేతు లివిగో
ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై
పనిచేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ
మై సొగసుగా జురుకు
దనముతో బరుగెత్త
వినయ పాదము లివిగో
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…
2. స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి
నిరతమ్ము పాడనిమ్ము
స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి
నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో
బరిపూర్ణముగ నింపు
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…
3. వెండి పసిడి యివిగో
వీస మైనను నాకై
యుండవలె నని కోరను
వెండి పసిడి యివిగో వీస మైనను నాకై
యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున
మెండుగ వాడ బరి
మితియౌ జ్ఞానం బిదిగో
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…
4. నా యిష్ట మిదిగో
యిది నీ యిష్టముగ జేయ
నా యిష్ట మిక గాదది
నా యిష్ట మిదిగో
యిది నీ యిష్టముగ జేయ
నా యిష్ట మిక గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హదయ మిదిగో నీ
కే యియ్యది రాజ కీయ సింహాసనమౌ
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…
5. ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే
నెన్నడు ధార వోయన్
ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే
నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు
చెన్నుగ నీ వశమై స్థిరముగ నుండెద
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు
వినతిన్ బ్రవహింప జే యను శక్తి నీయుమీ
తనువు నా దిదిగో గై కొనుమీ
యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ…

Leave a Reply