Sarveshwarudu Yesayya
సర్వేశ్వరుడు యేసయ్యా
మా జీవాధిపతి యేసయ్యా
సర్వేశ్వరుడు యేసయ్యా
మా జీవాధిపతి యేసయ్యా
వాగ్ధానమిచ్చి నెరవేర్చువాడు
వాగ్ధానమిచ్చి నెరవేర్చువాడు
కనిపెట్టి ప్రార్థించుమా
ప్రభునే కొనియాడి స్తుతియించుమా
కనిపెట్టి ప్రార్థించుమా
ప్రభునే కొనియాడి స్తుతియించుమా
సర్వేశ్వరుడు యేసయ్యా…
1. పాప ఊబిలో పడియున్న నన్ను
ప్రేమించి ప్రభువు రక్షించెగా
పాప ఊబిలో పడియున్న నన్ను
ప్రేమించి ప్రభువు రక్షించెగా
పరిశుద్ధ మనసుతో
ప్రభు యేసు రాకడకై
పరిశుద్ధ మనసుతో
ప్రభు యేసు రాకడకై
నీవే నీవే వేచియుండుమా
నీవే నీవే కనిపెట్టుమా
నీవే నీవే వేచియుండుమా
నీవే నీవే కనిపెట్టుమా
సర్వేశ్వరుడు యేసయ్యా…
2. శాంతిలేని ఈ లోకమందు
శాంతమునే ప్రభు కోరెగా
శాంతిలేని ఈ లోకమందు
శాంతమునే ప్రభు కోరెగా
నిందారహితునిగా నిష్కళంకునిగా
నిందారహితునిగా నిష్కళంకునిగా
నీవే నీవే కనిపించుమా
నీవే నీవే కొనసాగుమా
నీవే నీవే కనిపించుమా
నీవే నీవే కొనసాగుమా
సర్వేశ్వరుడు యేసయ్యా…
3. ఆశతో అత్యాసక్తితో
ఆ నీతి రాజ్యముకై కనిపెట్టుమా
ఆశతో అత్యాసక్తితో
ఆ నీతి రాజ్యముకై కనిపెట్టుమా
తన కృపతో మనకొసగును
ప్రేమతో స్థిరపరచును
తన కృపతో మనకొసగును
ప్రేమతో స్థిరపరచును
నీవే నీవే గమనించుమా
నీవే నీవే గ్రహియింపుమా
నీవే నీవే గమనించుమా
నీవే నీవే గ్రహియింపుమా
సర్వేశ్వరుడు యేసయ్యా
మా జీవాధిపతి యేసయ్యా
సర్వేశ్వరుడు యేసయ్యా
మా జీవాధిపతి యేసయ్యా
వాగ్ధానమిచ్చి నెరవేర్చువాడు
వాగ్ధానమిచ్చి నెరవేర్చువాడు
కనిపెట్టి ప్రార్థించుమా
ప్రభునే కొనియాడి స్తుతియించుమా
కనిపెట్టి ప్రార్థించుమా
ప్రభునే కొనియాడి స్తుతియించుమా
సర్వేశ్వరుడు యేసయ్యా…..

Leave a Reply