Sarvachittambu Needenayya
[Verse]
1. సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే
[Verse]
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ జేయుమయ్యా
సర్వేశ్వరా నేరిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును
[Verse]
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే…
[Verse]
2. ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి
[Verse]
పరికింపు నన్నీదివసంబున
పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబుబోవ నను గడుగుమా
[Verse]
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే…
[Verse]
3. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్థింతు నా రక్షకా
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్థింతు నా రక్షకా
[Verse]
నీచమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వశక్తుండవే
నీ చేత బట్టి నన్ రక్షింపుమా
[Verse]
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే…
[Verse]
4. ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహపరమున
ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహపరమున
[Verse]
అధికంబుగా నన్ నీయాత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా
[Verse]
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే…..

Leave a Reply