Sannutinthumo Prabho
[Verse]
1. సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా
కలుషము నెడబాపుమా ||
[Verse]
2. నీతి సూర్య తేజమా
జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా
పతితపావన నమకా ||
[Verse]
3. మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా
దేవమానవ నందనా
దివ్య సుగుణ మందనా ||
[Verse]
4. ప్రేమ తత్వబోధకా
క్షేమదాత వీవెగా
కామిత ఫలదాయక
స్వామియేసు నాయకా ||
[Verse]
5. పాపచింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్
నిరతము స్మరియించెదన్ ||

Leave a Reply