Sagilapadi Mrokkedam
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
1. మోషేకంటె శ్రేష్ఠుడు
అన్ని మోసములనుండి విడిపించున్
మోషేకంటె శ్రేష్ఠుడు
అన్ని మోసములనుండి విడిపించున్
[Verse]
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము ఆ ఆ ఆ
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
2. అహరోనుకంటె శ్రేష్ఠుడు
మన ఆరాధనకు పాత్రుండు
అహరోనుకంటె శ్రేష్ఠుడు
మన ఆరాధనకు పాత్రుండు
[Verse]
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము ఆ ఆ ఆ
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
3. ఆలయముకన్న శ్రేష్ఠుడు
నిజ ఆలయముగా తానే యుండెన్
ఆలయముకన్న శ్రేష్ఠుడు
నిజ ఆలయముగా తానే యుండెన్
[Verse]
ఆలయము మీరే యనెను
ఎల్లకాలము మ్రొక్కెదము ఆ ఆ ఆ
ఆలయము మీరే యనెను
ఎల్లకాలము మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
4. యోనాకంటె శ్రేష్ఠుడు
ప్రాణ దానముగ తన్ను అర్పించెన్
యోనాకంటె శ్రేష్ఠుడు
ప్రాణ దానముగ తన్ను అర్పించెన్
[Verse]
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము ఆ ఆ ఆ
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
5. సొలొమోనుకన్న శ్రేష్ఠుడు
సర్వ జ్ఞానమునకు ఆధారుండు
సొలొమోనుకన్న శ్రేష్ఠుడు
సర్వ జ్ఞానమునకు ఆధారుండు
[Verse]
పదివేలలో అతి ప్రియుండు
పదిలముగా మ్రొక్కెదము ఆ ఆ ఆ
పదివేలలో అతి ప్రియుండు
పదిలముగా మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
6. రాజులకంటె శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను జేసెన్
రాజులకంటె శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను జేసెన్
[Verse]
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము ఆ ఆ ఆ
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…
[Verse]
7. అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు
[Verse]
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము ఆ ఆ ఆ
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము ఆ ఆ ఆ
[Verse]
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదము…..

Leave a Reply