Randi Yutsahinchi Padudamu
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
[Verse]
నిండు కృతజ్ఞత స్తుతులతో
రయముగ నాయన సన్నిధికి
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
1. యెహోవా మహా దేవుడును
దేవతలందరి పైవాడని
మహాత్మ్యముగల మహారాజు
ఆయన పేరట కీర్తింతము
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
2. భూమ్యాగాధా స్థలములను
పర్వత శిఖరము లాయనవే
సముద్రము భూమియు నాయనదే
ఆయన హస్తములు చేసెన్
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
3. ఆయన మన దేవుడు మనము
ఆయన పాలించు ప్రజలే
ఆయన మేపెడు గొఱ్ఱెలము
ఆయన గానము జేయుదము
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
4. రండి నమస్కారముజేసి
సాగిల పడుదము మెండుగను
వెండియు మోకరించెదము
దండిగ నాయన సన్నిధిలో
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
5. ఆయన మనలను సృజించెను
ఆయన మాటను వినవలెను
ఆయన మాటెంతో మేలు
ఆయన కోపము రేపకుడి
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…
[Verse]
6. మన పితరులు విననందుననే
మస్సా మెరిబాలయొద్ద
మార్గము దప్పి యరణ్యములో
నలుబది యేండ్లు నశించిరయ్యో
[Verse]
రండి యుత్సహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే…..

Leave a Reply