Rakshakundudayinchi Nadata
రక్షకుండుదయించినాడట
మనకొరకు బరమ రక్షకుం డుదయించి
నాడట
రక్షకుం డుదయించినాడు
రారె గొల్లబోయలార తక్షణమున
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము
1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహొవా
మన దిక్కు దేరి చూచినాడు
2. గగనమునుండి డిగ్గి ఘనుఉడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త
3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచునాఉడు కర్తన జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు
4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె
5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు
Leave a Reply