Rajulaku Rajuvai Rayamuna
[Verse]
రాజులకు రాజువై రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
[Verse]
1. చీకటి కమ్మును సూర్యుని
కాంతిని ఇయ్యడు చంద్రుడు (2)
ఆకాశమునందలి శక్తులన్ని కదులును
లెక్కలేని చుక్కలు చెక్కలై చెదరును (2)
[Verse]
రాజులకు రాజువై
రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి
మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
[Verse]
2. దూతలు బూరను ఊదగా
నేత్రముల్ విప్పుదురు గోత్రముల్ (2)
ఇదియే దివికంతము జీవితములకంతము
రెండు గుంపులౌదురు ఏ గుంపున నుందువో (2)
[Verse]
రాజులకు రాజువై
రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి
మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
[Verse]
3. కాలము వ్యర్థము చేయక
బుద్ధిలేని కన్యకలతో చేరక (2)
తరుణముండగానే మీరు త్వరపడగా రండి
నిర్లక్ష్యముచేయక రక్షణనొందండి (2)
[Verse]
రాజులకు రాజువై
రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి
మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
[Verse]
4.జీవమా! నీవిక లేవవా!
యేసుని సేవను చేయవా (2)
పాతబ్రతుకు విడువుము
బంధకముల తెంచుము
విశ్వాసమునుంచుము
నిరతము ప్రార్థించుము (2)
[Verse]
రాజులకు రాజువై
రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి
మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
[Verse]
5. రావా! యేసువా! గావవా!
ఆకాశ మేఘారూఢుడవై (2)
ఆలించుము మనవులు
పాలించుము మమ్ముల
అన్ని ఈవులొసగిన
నా యేసుదేవా (2)
[Verse]
రాజులకు రాజువై
రయమున రావా (2)
రాజ్యమేల ఈ ధరలోకి
మరల రావా
నీ కొరకై వేచియుంటిమి (2)
Leave a Reply