Prabhuva Ninnaradhimpanu

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా

విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పగ
విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పగ
నభి దనంబులగూడి భక్తిని
యాత్మతో సత్యంబుతోడను

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా…

1. ఇరులుం గమ్మిననుండి
యరుణోదయము దనుక
నరిగాపు నీవే కదా
దేవా రాత్రి యరిగాపు నీవే కదా

ఇరులుం గమ్మిననుండి
యరుణోదయము దనుక
నరిగాపు నీవే కదా
దేవా రాత్రి యరిగాపు నీవే కదా

విరివిగా మా హదయసీమల
నెరసి యుండిన చీకటులుబో
విరివిగా మా హదయసీమల
నెరసి యుండిన చీకటులుబో

దరిమి శాంతంబైన మనసుల
దయ బ్రసాదింపను భజింతుము
ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా…

2. అనఘా నీ సాన్నిధ్య
మున నుండగా మా
దుర్మనసుల నరి కట్టుమో దేవా మా దుర్మనసుల శుచి జేయుము

అనఘా నీ సాన్నిధ్య
మున నుండగా మా
దుర్మనసుల నరి కట్టుమో దేవా మా దుర్మనసుల శుచి జేయుము

వినయ భయ భక్తులుదలిర్పగ
వినుచు నీ వాక్యోపదేశము
వినయ భయ భక్తులుదలిర్పగ
వినుచు నీ వాక్యోపదేశము

లనిశమును ధ్యానింపనాత్మను
బనిచి తుదకు బ్రసన్నమగుము
ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా…

3. పనిపాటలలో మేమీ
దినము నీకే మహిమ నొనగూర్ప
నడిపించుమో దేవా నిన్నే
ఘన పరచన్నడిపించుము

పనిపాటలలో మేమీ
దినము నీకే మహిమ నొనగూర్ప
నడిపించుమో దేవా నిన్నే
ఘన పరచన్నడిపించుము

తనువు శ్రమచే బడలినను మా
దారి దుర్గమమైన కనబడ
తనువు శ్రమచే బడలినను మా
దారి దుర్గమమైన కనబడ

వనట జెందక నేది జేసిన
బ్రభువు కొఱకని చేయ నడుపుము

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా

విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పగ
విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పగ
నభి దనంబులగూడి భక్తిని
యాత్మతో సత్యంబుతోడను

ప్రభువా నిన్నారాధింపను
జేరితిమి యుదయ
శుభకాంతిన్‌ ప్రభవింపగా దేవా నేడు
శుభకాంతిన్‌ విరజిమ్మగా…..

Leave a Reply