Prabhuva Nee Paripoornatha

[Verse]
ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను
ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

[Verse]
1. ప్రభువైన యేసుక్రీస్తు
పరలోక విషయములో
ప్రభువైన యేసుక్రీస్తు
పరలోక విషయములో

[Verse]
ప్రతి ఆశీర్వాదమును
ప్రసాదించితివి మాకు
ప్రతి ఆశీర్వాదమును
ప్రసాదించితివి మాకు

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
2. జనకా నీవెన్నుకొనిన
జనుల క్షేమము జూచి
జనకా నీవెన్నుకొనిన
జనుల క్షేమము జూచి

[Verse]
సంతోషించునట్లు
నను జ్ఞాపకముంచుకొనుము
సంతోషించునట్లు
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
3. నీదు స్వాస్థ్యమైనట్టి
నీ ప్రజలతో కలసి
నీదు స్వాస్థ్యమైనట్టి
నీ ప్రజలతో కలసి

[Verse]
కొనియాడునట్లుగా
నను జ్ఞాపకముంచుకొనుము
కొనియాడునట్లుగా
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
4. దేవా నీ ప్రజల యెడల
దిన దినము నీకున్న
దేవా నీ ప్రజల యెడల
దిన దినము నీకున్న

[Verse]
ఘనుడా నీదు దయతో
నను జ్ఞాపకముంచుకొనుము
ఘనుడా నీదు దయతో
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
5. దేవా నీదు స్వరూప
దివ్య దర్శనమును
దేవా నీదు స్వరూప
దివ్య దర్శనమును

[Verse]
దిన దినము నాకొసగి
నను జ్ఞాపకముంచుకొనుము
దిన దినము నాకొసగి
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
6. మీ మధ్యన నా ఆత్మ
ఉన్నది భయపడకు
మీ మధ్యన నా ఆత్మ
ఉన్నది భయపడకు

[Verse]
డనిన మహోన్నతుడా
నను జ్ఞాపకముంచుకొనుము
డనిన మహోన్నతుడా
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
7. ముదమార నన్నెన్నుకొని
ముద్ర యుంగరముగను
ముదమార నన్నెన్నుకొని
ముద్ర యుంగరముగను

[Verse]
చేతుననిన ప్రభువా
నను జ్ఞాపకముంచుకొనుము
చేతుననిన ప్రభువా
నను జ్ఞాపకముంచుకొనుము

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…

[Verse]
8. కృప సత్య సమ్మిళిత
సంపూర్ణ స్వరూప
కృప సత్య సమ్మిళిత
సంపూర్ణ స్వరూప

[Verse]
హల్లెలూయ నీకే ప్రభో
ఎల్లప్పుడు కలుగుగాక
హల్లెలూయ నీకే ప్రభో
ఎల్లప్పుడు కలుగుగాక

[Verse]
ప్రభువా
నీ పరిపూర్ణత నుండి
పొందితిమి
కృప వెంబడి కృపను…..

Leave a Reply