Prabhu Yesuni Vadanamulo

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే

[Verse]
పరికించిన శుభదినము
గమనించిన ఆ క్షణము
పరికించిన శుభదినము
గమనించిన ఆ క్షణము

[Verse]
పరలోకముకై చిరజీవముకై
ప్రార్థించెను నా హృదయం
పరలోకముకై చిరజీవముకై
ప్రార్థించెను నా హృదయం

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
1. దిశలన్నియు తిరిగితిని
నా పాపపు దాహముతో
దిశలన్నియు తిరిగితిని
నా పాపపు దాహముతో

[Verse]
దౌష్ట్యముతో మసలుచును
దౌర్జన్యము చేయుచును
దౌష్ట్యముతో మసలుచును
దౌర్జన్యము చేయుచును

[Verse]
ధన పీడనతో మృగవాంఛలతో
దిగజారితి చావునకు
ధన పీడనతో మృగవాంఛలతో
దిగజారితి చావునకు

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
2. చెండాడితి బ్రతుకులను
దహియించితి గృహములను
చెండాడితి బ్రతుకులను
దహియించితి గృహములను

[Verse]
చెరగవు నా పాపములు
తరగవు నా వేదనలు
చెరగవు నా పాపములు
తరగవు నా వేదనలు

[Verse]
చనిపోయినను ధర వీడినను
చల్లారవు శోకములు
చనిపోయినను ధర వీడినను
చల్లారవు శోకములు

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
3. పలుమారులు వినుచుంటి
నజరేయుని నీతి కథ
పలుమారులు వినుచుంటి
నజరేయుని నీతి కథ

[Verse]
పరిహాసము చేసితిని
పరమార్థమే మోసమని
పరిహాసము చేసితిని
పరమార్థమే మోసమని

[Verse]
పశుప్రాయుడనై జీవించుటచే
ప్రాప్తించెను ఈ సిలువ
పశుప్రాయుడనై జీవించుటచే
ప్రాప్తించెను ఈ సిలువ

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
4. కలువరి ఆవరణములో
కరుణాత్ముని చేరువనే
కలువరి ఆవరణములో
కరుణాత్ముని చేరువనే

[Verse]
కనుమూసిన కాలములో
వెలుగుదయించిన వేళ
కనుమూసిన కాలములో
వెలుగుదయించిన వేళ

[Verse]
కనుగొంటిని నా దౌర్భాగ్యస్థితి
కంపించెను నా హృదయం
కనుగొంటిని నా దౌర్భాగ్యస్థితి
కంపించెను నా హృదయం

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
5. యేసూ, నీ రాజ్యముతో
భువికేతెంచెడి రోజు
యేసూ, నీ రాజ్యముతో
భువికేతెంచెడి రోజు

[Verse]
ఈ పాపిని క్షమియించి
జ్ఞాపకముతో బ్రోవుమని
ఈ పాపిని క్షమియించి
జ్ఞాపకముతో బ్రోవుమని

[Verse]
ఇల వేడితిని విలపించుచును
ఈడేరెను నా వినతి
ఇల వేడితిని విలపించుచును
ఈడేరెను నా వినతి

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…

[Verse]
6. పరదైసున ఈ దినమే
నా ఆనందములోను
పరదైసున ఈ దినమే
నా ఆనందములోను

[Verse]
పాల్గొందువు నీవనుచు
వాగ్దానము చేయగనే
పాల్గొందువు నీవనుచు
వాగ్దానము చేయగనే

[Verse]
పరలోకమే నా తుది ఊపిరిగా
పయనించితి ప్రభుకడకు
పరలోకమే నా తుది ఊపిరిగా
పయనించితి ప్రభుకడకు

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే

[Verse]
పరికించిన శుభదినము
గమనించిన ఆ క్షణము
పరికించిన శుభదినము
గమనించిన ఆ క్షణము

[Verse]
పరలోకముకై చిరజీవముకై
ప్రార్థించెను నా హృదయం
పరలోకముకై చిరజీవముకై
ప్రార్థించెను నా హృదయం

[Verse]
ప్రభుయేసుని వదనములో
నా దేవుడు కనిపించే…..

Leave a Reply