Prabhu Yesu Na Rakshaka

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ

[Verse]
అల్ఫయు నీవే ఒమేగయు నీవే
అల్ఫయు నీవే ఒమేగయు నీవే

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ …

[Verse]
1. ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసూ నీ స్వరూపము
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసూ నీ స్వరూపము

[Verse]
ప్రియమార జూచి బహుధన్యుడయ్యే
ప్రియ ప్రభు నిను జూడ నిమ్ము
ప్రియమార జూచి బహుధన్యుడయ్యే
ప్రియ ప్రభు నిను జూడ నిమ్ము

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
2. లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని

[Verse]
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిను జూడనిమ్ము
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిను జూడనిమ్ము

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
3. ఎఱిగి యెఱిగి నే చెడిపోతిని
యేసూ నీ గాయము రేపితిని
ఎఱిగి యెఱిగి నే చెడిపోతిని
యేసూ నీ గాయము రేపితిని

[Verse]
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
4. ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున

[Verse]
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ

[Verse]
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుకక పరుగెత్త నేర్పు
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుకక పరుగెత్త నేర్పు

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
6. కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో

[Verse]
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివా నాకై
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివా నాకై

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…

[Verse]
7. లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము

[Verse]
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము

[Verse]
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ…..

Leave a Reply