Paravasini Nenee Jagamuna

పరవాసిని నే జగమున ప్రభువా
నడచుచున్నాను నా దారిన్‌
నా గురి నీవే నా ప్రభువా
నీ దరి నే చేరెదను నేను

1. లోకమంతా నాదనియెంచి
బంధుమిత్రులే ప్రియులను కొంటిని
అంతయు మోసమేగా
వ్యర్థము సర్వమును – ఇలలో
వ్యర్థము సర్వమును

పరవాసిని నే జగమున ప్రభువా
నడచుచున్నాను నా దారిన్‌
నా గురి నీవే నా ప్రభువా
నీ దరి నే చేరెదను నేను

2. ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున
పాపము నిండె జగములో
శాపము చేకూర్చుకొనె – లోకము
శాపము చేకూర్చుకొనె

పరవాసిని నే జగమున ప్రభువా
నడచుచున్నాను నా దారిన్‌
నా గురి నీవే నా ప్రభువా
నీ దరి నే చేరెదను నేను

3. తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు ఎంతో
తెలుపుము ఎంతల్పుడనో
విరిగి నలిగి యున్నాను – నేను
విరిగి నలిగి యున్నాను

పరవాసిని నే జగమున ప్రభువా
నడచుచున్నాను నా దారిన్‌
నా గురి నీవే నా ప్రభువా
నీ దరి నే చేరెదను నేను

4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితిననగా
మహానందము కలిగె – నాలో
మహానందము కలిగె

పరవాసిని నే జగమున ప్రభువా
నడచుచున్నాను నా దారిన్‌
నా గురి నీవే నా ప్రభువా
నీ దరి నే చేరెదను నేను

Leave a Reply