Parama Jeevamu Nakunivva

[Verse]
1. పరమ జీవము నాకునివ్వ
తిరిగి లేచెను నాతోనుండ
పరమ జీవము నాకునివ్వ
తిరిగి లేచెను నాతోనుండ

[Verse]
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును

[Verse]
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన – యే స్థితికైనా
నా జీవితములో – యేసు చాలును…

[Verse]
2. సాతాను శోధన అధికమైన
సొమ్మసిల్లక సాగివెళ్లెదను
సాతాను శోధన అధికమైన
సొమ్మసిల్లక సాగివెళ్లెదను

[Verse]
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను

[Verse]
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన – యే స్థితికైనా
నా జీవితములో – యేసు చాలును…

[Verse]
3. పచ్చిక బయలులో పరుండజేయున్‌
శాంతి జలముచెంత నడిపించును
పచ్చిక బయలులో పరుండజేయున్‌
శాంతి జలముచెంత నడిపించును

[Verse]
అనిశము ప్రాణము తృప్తిపరచున్‌
మరణలోయలో నన్ను కాపాడును
అనిశము ప్రాణము తృప్తిపరచున్‌
మరణలోయలో నన్ను కాపాడును

[Verse]
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన – యే స్థితికైనా
నా జీవితములో – యేసు చాలును…

[Verse]
4. నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను

[Verse]
హరించినన్‌ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను
హరించినన్‌ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను

[Verse]
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన – యే స్థితికైనా
నా జీవితములో – యేసు చాలును…

[Verse]
పరమ జీవము నాకునివ్వ
తిరిగి లేచెను నాతోనుండ
పరమ జీవము నాకునివ్వ
తిరిగి లేచెను నాతోనుండ

[Verse]
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును

[Verse]
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన – యే స్థితికైనా
నా జీవితములో – యేసు చాలును…..

Leave a Reply