O Prarthana Su Prarthana
1.ఓ ప్రార్థనా సుప్రార్థనా
నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమౌ సుప్రార్థనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్థనా సుప్రార్థనా
2.పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమైన ప్రార్థనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్థనా
3.నీ దివ్యమైన రెక్కలే
నా దుఖభార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబుకు గొంచు బోవును
సదా శుభంబు లందను
విధంబుకు జూప నేవెగా
నా ధైర్య మిచ్చు ప్రార్థనా
సుధా సుధార ప్రార్థనా
4.అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిరగృహంబుకు జూతును
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్థనా
Leave a Reply