Nirmala Manassutho

నిర్మల మనస్సుతో నీ పదసన్నిధికి
నిర్మల హృదయుడా
తెచ్చాము కానుకన్‌ (2)
స్వీకరించుమయా స్వామి
స్వీకరించుమయా (4)

1. నింగి నేల నీదే దేవా
నీరు నిప్పు నీదేనయ్యా (2)
నీది కానిది లేదే దేవా (2)
నీవు ఇవ్వనిది మాకే లేదయ్యా (2)

నిర్మల మనస్సుతో నీ పదసన్నిధికి
నిర్మల హృదయుడా
తెచ్చాము కానుకన్‌ (2)

2. నిర్మల మనస్సు ఇచ్చావు దేవా
నీకు అర్పణలెన్నో తెచ్చామయ్యా (2)
నీ కుమారుణ్ణి శరీర రక్తముగా (2)
నీవు మార్చి ఇల పంపావయ్యా (2)

నిర్మల మనస్సుతో నీ పదసన్నిధికి
నిర్మల హృదయుడా
తెచ్చాము కానుకన్‌ (2)
స్వీకరించుమయా స్వామి
స్వీకరించుమయా (4)

Leave a Reply