Nijamuga Morapettina

నిజముగా మొరపెట్టినా
దేవుడాలకించకుండునా ?
సహనముతో కనిపెట్టినా
సమాధానమీయకుండునా ?

జీవముగల దేవుడు
మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన
మేలుచేయకుండునా ?

1. పరలోక తండ్రినడిగినా
మంచి ఈవులీయకుండునా ?
కరములెత్తి ప్రార్ధించినా
దీవెనలే కురియకుండునా ?

జీవముగల దేవుడు
మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన
మేలుచేయకుండునా ?

2. సృష్టికర్తయైన వానికి
మన అక్కర తెలియకుండునా ?
సరియైన సమయానికి
దయచేయక ఊరుకుండునా ?

జీవముగల దేవుడు
మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన
మేలుచేయకుండునా ?

Leave a Reply