Neeve Na Santhosha Ganamu
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము…
1. త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువైయుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువైయుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ
ఎదురింతు నీ ప్రేమతో
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ
ఎదురింతు నీ ప్రేమతో
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము…
2. వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము…
3. నిర్జీవమైన లోయయందు
జీవాధిపతివై వెలసినావు
దీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
నిర్జీవమైన లోయయందు
జీవాధిపతివై వెలసినావు
దీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే రారాజువు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మారాజువు
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము…
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము
నీవే నా సంతోష గానము
రక్షణ శృంగము మహా శైలము…..
Leave a Reply