Nee Jeevithamlo Gamyambu
నీ జీవితములో గమ్యంబు ఏదో
ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు
నీ హృదయ మర్పించవా?
1. నీ తల్లి గర్బమున నీ వుండినపుడే
నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించి నావా ఏరీతి నిన్ను
నిర్మించే తన చేతులు
2. నీ లోన తాను నివసింపగోరి
దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను
3. తన చేతులందు హృదయంబు ధారల్
స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష నీ కోసమేగా
ఒకసారి గమనించవా?
4. ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి
సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక
పోభోకుమా సోదరా

Leave a Reply