Israelu Kapari Neeku Stotramu
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నా కాపరి నీకు స్తోత్రము
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
1. ఘనులైనవారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగ నుంచావు (2)
2. మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోనచలు భంగపరచియున్నావు (2)
3. ఈ లోకయాత్రలో సాక్షులుగా
నీ రాజ్యవ్వాప్తిలో పాత్రలుగా (2)
ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు (2)
Leave a Reply