Ashraya Duragama Na Yesayya

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే – నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే

1.లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన
మహిమల స్తోత్రాంజలి

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున
నన్ను నడిపించుమా!

2.నాతో నీవు చేసిన
నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున
నన్ను నడిపించుమా!

3.పరవాసినైతిని
వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొందెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున
నన్ను నడిపించుమా!

4.నిత్యనివాసివై నీ ముఖము
చూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము
నాలో కలిగించుచున్నది

స్తుతిఘన మహిమలు
నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా!

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే – నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే

Leave a Reply