Aatma Nadupu Satyamulonki
[Verse]
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే
యాత్మా నడుపు
ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి
ఆత్మానందముతో దై వారాధనమున
[Verse]
1. ఘోర కలుషంబుల
దూరంబుగాఁ దోలి
పారమార్థిక బుద్ధిఁ
గోరు నట్టులను
[Verse]
2. అంధత్వంబు వలన
మందమైయుండు మా
డెందంబు లెల్ల నీ
యందు వెలుఁగుటకు
[Verse]
3. నిర్మల హృదయంబు
నిరతంబు మా కిచ్చి
కూర్మిన్ నీ వరములఁ
గూర్చి దీవించి
[Verse]
4. సకల మానవులతో
అకలంక శుభవార్తఁ
బ్రకటించు బలజ్ఞాన
నికరంబు నిచ్చి
[Verse]
5. దీవించి పంపు మో
దైవాత్మా మమ్మును
భావజ్ఞాన మొసంగి
ప్రభు సేవలోన

Leave a Reply