[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి
కస్తూరి పూరాసి ఆ… ఆ…
స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి
కస్తూరి పూరాసి
[Verse]
వర్తమాన భూత భవిష్యత్కాలవాసి
వర్తమాన భూత భవిష్యత్కాలవాసి
ఆల్ఫా ఓమేగా తానే
ఆల్ఫా ఓమేగా తానే
[Verse]
ఆద్యంతము మన యేసే
ఆద్యంతము మన యేసే
స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
1. ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముల జేతున్
నీ ప్రజలందరియెదుట ఆ… ఆ…
[Verse]
ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముల జేతున్
నీ ప్రజలందరియెదుట
[Verse]
పరిశోధింపజాలని మహా
పనులెల్ల ప్రభువే
పరిశోధింపజాలని
మహా పనులెల్ల ప్రభువే
[Verse]
లెక్కలేని యద్భుతముల్
లెక్కలేని యద్భుతముల్
మక్కువతో చేయువాడు
మక్కువతో చేయువాడు
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
2. సంగీత నాదములతోడ
సీయోనుపురము
సొంపుగను చేరితిమి ఆ… ఆ…
[Verse]
సంగీత నాదములతోడ
సీయోనుపురము
సొంపుగను చేరితిమి
[Verse]
శాశ్విత సంతోషము మా
శిరములపై వెలసెన్
శాశ్విత సంతోషము మా
శిరములపై వెలసెన్
[Verse]
దుఃఖము నిట్టూర్పును పోయెన్
దుఃఖము నిట్టూర్పును పోయెన్
మిక్కిలి ఆనందము గల్గెన్
మిక్కిలి ఆనందము గల్గెన్
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
3. నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో
మాణిక్య మణులతో ఆ… ఆ…
[Verse]
నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో
మాణిక్య మణులతో
[Verse]
సువర్ణ శునీయముల
సూర్యకాంతముతో
సువర్ణ శునీయముల
సూర్యకాంతముతో
[Verse]
ప్రశస్త రత్నములతో
ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగ నిను గట్టెదను
ప్రవిమలముగ నిను గట్టెదను
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
4. సుమముల హారము
సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే ఆ… ఆ…
[Verse]
సుమముల హారము
సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే
[Verse]
ఉల్లాస వస్త్రంబు నీదే
విడుదలయు నీదే
ఉల్లాస వస్త్రంబు నీదే
విడుదలయు నీదే
[Verse]
హితవత్సరము విముక్తి
హితవత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీదే
ఆత్మాభిషేకము నీదే
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
5. జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను
నీ తోడై యుండెదను ఆ… ఆ…
[Verse]
జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను
నీ తోడై యుండెదను
[Verse]
నదులలో వెళ్లునప్పుడు
నీపై పారవు
నదులలో వెళ్లునప్పుడు
నీపై పారవు
[Verse]
అగ్ని మధ్యను నడిచినను
అగ్ని మధ్యను నడిచినను
జ్వాలలు నిను కాల్చగలేవు
జ్వాలలు నిను కాల్చగలేవు
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
6. ఇత్తడి తలుపుల బగులగొట్టెద
ఇనుప గడియలను
విడగొట్టెదను నేను ఆ… ఆ…
[Verse]
ఇత్తడి తలుపుల బగులగొట్టెద
ఇనుప గడియలను
విడగొట్టెదను నేను
[Verse]
అంధకార స్థలములలో
నున్నట్టి నిధులను
అంధకార స్థలములలో
నున్నట్టి నిధులను
[Verse]
రహస్యములో మరుగైన
రహస్యములో మరుగైన
ధనమును నీ కొసంగెదను
ధనమును నీ కొసంగెదను
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…
[Verse]
7. గర్భమున పుట్టినది మొదలు
తల్లియొడిలోన
కూర్చుండినది మొదలు ఆ… ఆ…
[Verse]
గర్భమున పుట్టినది మొదలు
తల్లియొడిలోన
కూర్చుండినది మొదలు
[Verse]
నేను చంకబెట్టుకొన్న
నాదు ప్రజలారా
నేను చంకబెట్టుకొన్న
నాదు ప్రజలారా
[Verse]
ముదిమి వచ్చు వరకు నిన్ను
ముదిమి వచ్చు వరకు నిన్ను
ఎత్తుకొను వాడను నేనే
ఎత్తుకొను వాడను నేనే
[Verse]
స్వచ్ఛంద సీయోనువాసి
సర్వాధికారి
కస్తూరి పూరాసి…..

Leave a Reply