శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
కన్నియ మరియమ్మ గర్భమందున
కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
ఇమ్మానుయేలనెడి నామమందున
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
సత్రమందున పశువులశాలయందున
సత్రమందున పశువులశాలయందున
దేవ పుత్రుండు మనుజుండాయెనందున
దేవ పుత్రుండు మనుజుండాయెనందున
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
పట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి
పట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి
పసుల తొట్టిలో పరుండబెట్టబడి
పసుల తొట్టిలో పరుండబెట్టబడి
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ
తెల్పె గొప్ప వార్త దూత చల్లగ
తెల్పె గొప్ప వార్త దూత చల్లగ
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
మన కొఱకొక్క శిశువు పుట్టెను
మన కొఱకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల పోగొట్టెను
ధరను మన దోషముల పోగొట్టెను
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
పరలోకపు సైన్యంబు గూడెను
పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…
అక్షయుండగు యేసు వచ్చెను
అక్షయుండగు యేసు వచ్చెను
మనకు రక్షణంబు సిద్ధపర్చెను
మనకు రక్షణంబు సిద్ధపర్చెను
శ్రీయేసుండు జన్మించె రేయిలో
శ్రీయేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో
నేడు పాయక బెత్లెహేమయూరిలో…..

Leave a Reply