సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళయిన
శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2)

సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగధ్వనులతో
సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహుధీరుడా (2)

సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహుతరములకు
శోభాతిశయముగ చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించె నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహుశూరుడా (2)

సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading