సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
1. ఆ ప్రభువే దేవుండు
అధిక స్తోత్రార్హుండు
భూ ప్రజల నందరిని
బుట్టించిన భగవంతుండు
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
2. మనము దేవుని వారమును
మరి మనమాయన ప్రజలు
మనయము నా ఘన ప్రభువు
నెనరుతో మేపెడి గొఱ్ఱెలము
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
3. కృతజ్ఞతార్పణలు
కొల్లగను జెల్లింప
నాతని యావరణములో
నతి వినయముతో జేరండి
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
4. ఆయన దయామయుడు
ఆయన కృపామయుడు
ఆయన ప్రేమసత్యం
బనవరతంబుండును నిజమే
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
5. శుభనామం మదినుంచి
ప్రభునామం స్తుతియించి
ఘననామం బతిభక్తిన్
అనయము గొలువుడి
జనులారా
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి
6. పితృపుత్రాత్మకును
ప్రియ మహిమ మగుగాక
ఆదిని నుండిన రీతి
ననవరతంబుండునుగాక
సర్వ దేశములారా
శ్రీయేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో
గురు స్తోత్రము జేయను రండి

Leave a Reply