[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్
[Verse]
వింతగ వలసిన దంతయు నొసగును
వింతగ వలసిన దంతయు నొసగును
వినయ మనసుగల విశ్వాసులకును
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…
[Verse]
1. అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జనులందఱకు
అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జనులందఱకు
[Verse]
సత్య సువార్తను జాటించుటకై
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…
[Verse]
2. వేదవాక్యమును వేరు వేరు
గ్రామాదుల నుండెడు బాలురకు
వేదవాక్యమును వేరు వేరు
గ్రామాదుల నుండెడు బాలురకు
[Verse]
సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి
సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…
[Verse]
3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
[Verse]
నిక్కపు రక్షణ నిద్ధరలో నలు
నిక్కపు రక్షణ నిద్ధరలో
నలు ప్రక్కలలో బ్రకటించుట కొఱకై
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…
[Verse]
4. ఇయ్యండీ మీ కీయం బడునని
యియ్యంగల ప్రభుయేసనెను
ఇయ్యండీ మీ కీయం బడునని
యియ్యంగల ప్రభుయేసనెను
[Verse]
ఇయ్యది మరువక మదినుంచుకొని
ఇయ్యది మరువక మదినుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…
[Verse]
5. భక్తి గలిగి ప్రభు పనికిచ్చుట
బహు యుక్తమటంచును ధారతతో
భక్తి గలిగి ప్రభు పనికిచ్చుట
బహు యుక్తమటంచును ధారతతో
[Verse]
శక్తి కొలది మన భుక్తినుండి యా
శక్తి కొలది మన భుక్తినుండి
యాసక్తితో నిరతము నియ్యవలెను
[Verse]
సంతోషముతో నిచ్చెడు వారిని
ఎంతో దేవుడు ప్రేమించున్…..

Leave a Reply