Tellavarenu Tjarillenu
తెల్లవారెను తేజరిల్లెను భువి
దేవదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
దేవదూత తొలగించెను బండ
యేసు లేచెను
సాతాను కూలెను
యేసు లేచెను
సాతాను కూలెను
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
1. సమాధిని మాత్రమే చూడవచ్చిన స్త్రీలకు
సమాధిని మాత్రమే చూడవచ్చిన స్త్రీలకు
సమృద్ధిగా దొరికెను సమాదానము
సమృద్ధిగా దొరికెను సమాదానము
సంతుష్టితో సంతోషముతో
పరిగెత్తిరి గొప్పసందడి
సంతుష్టితో సంతోషముతో
పరిగెత్తిరి గొప్పసందడి
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
2. మూల్గుచూ వచ్చిన మరియ
తిరిగి వెళ్లెను మురియుచు మదిలో
మూల్గుచూ వచ్చిన మరియ
తిరిగి వెళ్లెను మురియుచు మదిలో
మరువని అనుభూతితో
మహానందముతో
మరువని అనుభూతితో
మహానందముతో
మొదట ప్రభుని చూచిన మహా ధన్యత
మిగిల్చెను మితిలేని సవ్వడి
మొదట ప్రభుని చూచిన మహా ధన్యత
మిగిల్చెను మితిలేని సవ్వడి
3. పాపమునకు సిల్వలో
ప్రాయశ్చిత్తమాయెను
పాపమునకు సిల్వలో
ప్రాయశ్చిత్తమాయెను
నిత్య మరణం యేసు
రక్తములో నిర్వీర్యమాయెను
నిత్య మరణం యేసు
రక్తములో నిర్వీర్యమాయెను
నీతిమంతుని నీతిమార్గము
నడిపించెను నిత్యజీవానికి
నీతిమంతుని నీతిమార్గము
నడిపించెను నిత్యజీవానికి

Leave a Reply