Talachukunte Chalunu
తలచుకుంటే చాలును
ఓ యేసు నీ ప్రేమ
జల జలజల రాలును
కృతజ్ఞత కన్నీళ్లు
తలచుకుంటే చాలును
కరిగించును రాళ్లను
కల్వరి స్వరము
ఇది కల్వరి స్వరము
తలచుకుంటే చాలును
1. నీ మోమున ఊసిన ఉమ్ములు
నా మోహపు చూపు తుడిచెను
నీ చెంపను కొట్టిన దెబ్బలు
నా నోటిని శుద్ధిచేసెను (2)
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
నా మోసపు
తలపును త్రుంచెను (2)
ఎంత త్యాగపూరితమో నీ ప్రేమ
ఎంత క్షమాభరితమో నీ ప్రేమ
తలచుకుంటే చాలును
ఓ యేసు నీ ప్రేమ
జల జలజల రాలును
కృతజ్ఞత కన్నీళ్లు
తలచుకుంటే చాలును
2. నీ దేహము చీరిన కొరడా
నా కామమును చీల్చెను
నీ చేతుల కాళ్లకు మేకులు
నా చీకటి దారి మూసెను(2)
సిలువ నెత్తుటి ధారలు
నా కలుషమును
కడిగివేసెను(2)
ఎంత త్యాగపూరితమో నీ ప్రేమ
ఎంత క్షమాభరితమో నీ ప్రేమ
తలచుకుంటే చాలును
ఓ యేసు నీ ప్రేమ
జల జలజల రాలును
కృతజ్ఞత కన్నీళ్లు
తలచుకుంటే చాలును
కరిగించును రాళ్లను
కల్వరి స్వరము
ఇది కల్వరి స్వరము
తలచుకుంటే చాలును

Leave a Reply