Stuthi Simhasanaseenuda Na Aradhanaku
[Verse]
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా
[Verse]
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్
స్తుతి సింహాసనాసీనుడా…
[Verse]
1. నా వేదనలో నా శోధనలో
లోకుల సాయము వ్యర్థమని తలచి
నా వేదనలో నా శోధనలో
లోకుల సాయము వ్యర్థమని తలచి
[Verse]
నీ కోసమే నీ కృప కోసమే
నీ కోసమే నీ కృప కోసమే
నీ సముఖములో నిలిచానయా యేసయ్యా
నీ ఆత్మతో నింపుమయా
[Verse]
నీ సముఖములో నిలిచానయా యేసయ్యా
నీ ఆత్మతో నింపుమయా
స్తుతి సింహాసనాసీనుడా…
[Verse]
2. నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని
నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని
[Verse]
నీ కోసమే నీ కృప కోసమే
నీ కోసమే నీ కృప కోసమే
నీ నీడలో నిలిచానయా యేసయ్యా
నీ శక్తితో నింపుమయా
[Verse]
నీ నీడలో నిలిచానయా యేసయ్యా
నీ శక్తితో నింపుమయా
స్తుతి సింహాసనాసీనుడా…
[Verse]
3. నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని
నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని
[Verse]
నీ కోసమే నీ కృప కోసమే
నీ కోసమే నీ కృప కోసమే
నీ వెలుగులో నిలిచానయా యేసయ్యా
నీ మహిమతో నింపుమయా
[Verse]
నీ వెలుగులో నిలిచానయా యేసయ్యా
నీ మహిమతో నింపుమయా
[Verse]
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా
స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా
[Verse]
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్
స్తుతి సింహాసనాసీనుడా…..

Leave a Reply