Stotrinthumu Ninu Madu Tandri
[Verse]
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు
[Verse]
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
1. శ్రేష్ఠయీవుల యూటనీవే
శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
శ్రేష్ఠయీవుల యూటనీవే
శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
[Verse]
త్రిత్వమై యేకత్వమైన
త్రిలోకనాధా శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
2. పాపి మిత్రుడ పాపనాశక
పరమవాసా ప్రేమపూర్ణా
పాపి మిత్రుడ పాపనాశక
పరమవాసా ప్రేమపూర్ణా
[Verse]
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా
పరిశుద్ధాంగుడ శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
3. ధవళవర్ణుడా రత్నవర్ణుడా
సత్యరూపి యనబడువాడా
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
సత్యరూపి యనబడువాడా
[Verse]
నను రక్షించిన రక్షకుండవు
నాథా నీవే శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
4. బంగారు వెంట్రుకలు తలపై
ఉంగరములుగ కనబడుచున్నవి
బంగారు వెంట్రుకలు తలపై
ఉంగరములుగ కనబడుచున్నవి
[Verse]
వేలలో నతి కాంక్షనీయుడా
వేలకొలది శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
5. గువ్వలవంటి కన్నులు
పువ్వులవంటి చెక్కిళ్లు
గువ్వలవంటి కన్నులు
పువ్వులవంటి చెక్కిళ్లు
[Verse]
మంచి రూపము కల్గినందున
మాకు నీవే శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
6. చేతులు బంగారుమయము
చెక్కిన రత్నముల వంటివి
చేతులు బంగారుమయము
చెక్కిన రత్నముల వంటివి
[Verse]
కాళ్లు రాతి స్తంభములవలె
కన్పడుచున్నందున శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
7. సంఘమునకు శిరస్సునీవే
రాజ నీకే నమస్కారములు
సంఘమునకు శిరస్సునీవే
రాజ నీకే నమస్కారములు
[Verse]
ముఖ్యమైన మూలరాయి
కోట్ల కొలది శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
8. నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
[Verse]
అందముగను కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…
[Verse]
9. రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
[Verse]
శుభము శుభము శుభము నిత్యము
హల్లెలూయా ఆమేన్ ఆమేన్
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు…..

Leave a Reply